రాజేంద్రనగర్‌లో ప్లైవుడ్ గోదాం మంటల్లో ఆవిరైపోయిన కోటీ విలువైన ఆస్తి!
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్(Rajendranagar Police Station) పరిధిలోని కాటేదాన్ సమీపంలోని ప్లైవుడ్ గోదాములో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. గిడ్డంగి నుండి దట్టమైన మంటలు(Major Fire Accident), పొగ ఎగసిపడుతున్నట్లు గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది రెండు అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలను ఆర్పేందుకు 2 గంటల సమయం పట్టిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తోంది. సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
మెదక్‌లో పన్ను వసూళ్ల టెన్షన్… రూ.2.75 కోట్లు ఇంకా బాకీ
సాయినగర్ ఫేస్-3లో ప్రాణాలకు ముప్పు… డ్రైనేజీ గుంతపై అధికారుల నిర్లక్ష్యం!
ఇంటి పన్ను కేవలం ₹120… కానీ నల్లా పన్ను ₹1200! కేసముద్రంలో ప్రజల ఆవేదన




