27 July, 2026 | 2:50 AM

సూర్యాపేట మండల కార్యాలయాల పరిసరాల్లో అపరిశుభ్రత పట్ల ప్రజల ఆందోళన

27-07-2026 12:43 AM

కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

సూర్యాపేట రూరల్, జులై 26: సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డ ప్రాంతంలో ఉన్న మం డల కార్యాలయాలు అయినటువంటి జిల్లా పరిషత్, ఎంపీడీవో, ఐకేపీ కార్యాలయాల పరిసరాల్లో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, పేరుకుపోయిన చెత్తాచెదారం వల్ల తీవ్ర అపరిశుభ్ర వాతా వరణం నెలకొంది. వివిధ పనుల నిమిత్తం ఈ మండల కేంద్రానికి వచ్చే ప్రజలు, ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బంది సాయంత్ర వేళల్లో దోమల బెడదతో పాటు, వర్షాకాలం కాబట్టి పెరిగిన చెట్ల పొదల్లో నుంచి ఎటువంటి విషపూరిత పాములు కానీ తేలులు కానీ వస్తాయేమో అని భ యంతో కాలం గడపాల్సి వస్తోంది, పనుల కోసం వచ్చి దోమకాట్లతో వ్యాధుల బారిన పడతామేమోనని,

మండల కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక గ్రామాల పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కార్యాలయా ల ఆవరణను శుభ్రపరచడం, పిచ్చి మొక్కలను తొలగించి ఫాగింగ్ చేయించడం వంటి చర్యలు చేపట్టేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని, జిల్లా కలెక్టర్ గారు స్వయంగా స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు, ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.