27 July, 2026 | 2:26 AM

హాకీ వేడుకల్లో పాల్గొన్న తాటి

27-07-2026 12:42 AM

సత్తుపల్లి జూలై 26. ( విజయ క్రాంతి ): సత్తుపల్లి వి కన్వెన్షన్లో నిర్వహించిన బురాన్  మనవడు, మనవరాళ్ల హాకీక వేడుకలకు హాజరైన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు  చిన్నారులను ఆశీర్వదించి, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బురాన్ కుటుంబ సభ్యులను ఆప్యాయంగా అభినందించిన తాటి వెంకటేశ్వర్లు  చిన్నారులు ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఎదిగి కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిన్న తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు, గడ్డుమడుగు రవి కుమార్  మురహరి రాంబాబు  భీముడు నాయక తదితరులు పాల్గొన్నారు.