27 July, 2026 | 3:36 AM

మోదీ దిష్టిబొమ్మ దహనం

27-07-2026 12:43 AM

ఎర్రుపాలెం జూలై 26 (విజయక్రాంతి):  బ్రిటిష్ పాలకులను భారతదేశo నుండి ఆనాడు తరిమికొట్టడానికి ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేపడితే ఈనాడు మోదీని గద్దె దించడానికి క్విట్ ఇండియా స్ఫూర్తితో  అగస్టు నెల పదవ తారీకు ఆదివారం జైలు బరో కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబా బు, ఎర్రా శ్రీకాంత్ పేర్కొన్నారు. 

అమెరికా- భారత్ వ్యవసాయ వాణిజ్య ఒప్పందాన్ని ర ద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రై తు సంఘం ఆధ్వర్యంలో మండల పరిధిలో ని భీమవరం గ్రామంలో గల సిపిఎం పార్టీ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహ నం చేసి నిరసన వ్యక్తపరిచారు.భారత ప్రభు త్వం అమెరికా యూరోపియన్ యూనియ న్ యునైటెడ్ కింగ్డమ్ న్యూజిలాండ్ తదితర దేశాలతో కుదురుచుకుంటున్న స్వేచ్ఛ వాణి జ్య ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరచలేదని విమర్శించారు. విద్యుత్ సంస్కరణల పేరుతో డిస్కములకు లాభాలు చేకూర్చేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు.రైతుల బోర్లకు కరెంటు స్మార్ట్ మీట ర్లు బిగించేందుకు ప్రయత్నం చేస్తుందని అ న్నారు. పేదవారికి 200 యూనిట్ల ఉచిత క రెంటును ఎత్తివేసేందుకు పథకాలు వేస్తున్నారని అన్నారు. ఆగస్టు నెల పదవ తారీఖున జరగనున్న జైలు బరో కార్యక్రమంలో అన్ని ప్రజా సంఘాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వీరయ్య, మండల కార్యదర్శి ప్రభాకర్ రావు, హనుమంతరావు, వెంకటేశ్వర్లు, షేక్ లాలా, తిరుపతిరావు, నాగేశ్వరరావు, కిషోర్, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.