ఖమ్మంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
08-06-2026 10:47 AM
పెనుబల్లి: ఖమ్మం జిల్లా(Khammam) పెనుబల్లి మండలం కోతలంకపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి రైల్వే వంతెనను ఢీకొట్టి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా(Private Travels Bus Accident) పడటంతో కనీసం 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న KVR ట్రావెల్స్‌కు చెందిన ఒక బస్సు, అర్ధరాత్రి వేళ అదుపు తప్పి రైల్వే వంతెనను ఢీకొట్టింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, రోడ్డు ప్రమాదంలో గాయపడిన 15 మంది ప్రయాణికులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌ల ద్వారా సత్తుపల్లి, పెనుబల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






