ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం
08-06-2026 10:36 AM
మనీలా: ఫిలిప్పీన్స్‌లోని ఒక దక్షిణ ద్వీపాన్ని 7.8 తీవ్రతతో కూడిన భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. దక్షిణ ఫిలిప్పీన్స్ లోని మిండనావో దీవి వద్ద భూకంపం వచ్చింది. భూకంపం ధాటికి పలు నగరాల్లో భవనాలు దెబ్బతిన్నాయి. జనరల్ శాంటోస్ నగరానికి సమీపంలో భూకంప కేంద్రగా ఉన్నట్లు గుర్తించారు. ఫిలిప్పీన్స్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఫిలిప్పీన్స్ తీరంలో 10 అడుగుల ఎత్తున అలలు ఎగిరిపడే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. భారీ భూకంపంలో ముగ్గురు మరణించగా, నలుగురు గాయపడ్డారని పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. అత్యవసర సేవా విభాగాలను వెంటనే రంగంలోకి దింపినట్లు అధికారులు తెలిపారు.






