calender_icon.png 8 February, 2026 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలిన ప్రైవేట్ విమానం... ఇద్దరికి గాయాలు

08-02-2026 05:41:39 PM

బెంగళూరు: కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఆదివారం ప్రైవేట్ శిక్షణ విమానం కూలింది. ఈ ఘటన బాబలేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళూరు గ్రామంలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన క్షతగాత్రులను అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... రెడ్ బర్డ్ ఏవియేషన్‌కు చెందిన ప్రైవేట్ శిక్షణ విమానామని, ఇది కలబురగి నుండి బెళగావికి వెళ్తుండగా, ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తి అకస్మాత్తుగా కూలిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తు తెలిసిందన్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఆ తేలికపాటి విమానంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, వారిని కెప్టెన్, శిక్షణ పొందుతున్న పైలట్‌గా గుర్తించామని అధికారి ధృవీకరించారు. ఈ  ప్రమాదం కెప్టెన్, ట్రైనీ పైలట్ గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం నుండి వచ్చిన దృశ్యాలలో విమానం నేలను ఢీకొన్న తర్వాత నుజ్జునుజ్జు అయిందని, ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపించింది. ఈ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.