2 May, 2026 | 1:10 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

బంగ్లా హిందువులు పోరాడాలి

09-02-2026 01:06 AM
  1. యావత్ ప్రపంచ హిందువుల మద్దతు వారికే.. 
  2. భయపడినంత కాలం దాడులు ఆగవు 
  3. ఎదురుతిరిగి నిలబడితేనే మనుగడ 
  4. ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు మోహన్ భగవత్ పిలుపు 
  5. ముంబైలో ‘వందేళ్ల ఆర్‌ఎస్‌ఎస్ ప్రస్థానం-కొత్త లక్ష్యాలు’ వేడుకలు

ముంబై, ఫిబ్రవరి ౮: బంగ్లాదేశ్‌లో మైనార్టీగా ఉన్న 1.25 కోట్ల మంది హిందువులు తమపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్‌ఎస్‌ఎస్) జాతీయ అధ్యక్షుడు మోహన్ భగ వత్ పిలుపునిచ్చారు. బంగ్లా హిందువులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మద్ద తు ఇస్తారని హామీ ఇచ్చారు. ‘వందేళ్ల ఆర్‌ఎస్‌ఎస్ ప్రస్థానం- కొత్త లక్ష్యాలు’ పేరిట ఆది వారం ముంబైలో నిర్వహించిన వేడుకలో ఆయన మాట్లాడారు.

బంగ్లా రాజకీయ వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నా ఐక్యత ఒక్కటే, హిందువుల ముం దున్న మార్గమని అభిప్రాయపడ్డారు. ఎవరైనా పారిపోతున్నంత కాలం వేధిస్తున్నారని, ఒక్కసారి నిలబడి ఎదిరిస్తే, ఎవరూ ఏం చేయలేరని చెప్పుకొచ్చారు. భారత ప్రభుత్వం అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకొనే ‘ఉమ్మడి పౌరస్మృతి’ రూపొందించాలని, ఆ ప్రక్రియ విభేదాలకు దారితీయకూడదని ఆకాంక్షించారు.

భారత్‌లోకి ఎవరైనా విదేశీయులు అక్రమంగా ప్రవేశిస్తే, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. భారతీయులు ఎట్టిపరిస్థితుల్లోనూ విదేశీ చొరబాటుదారులకు ఉపాధి కల్పించవద్దని పిలుపునిచ్చారు.  చొరబాటుదారులను ఏరివేసే విషయంలో భారతప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణన సమయంలో చొరబాటుదారులంతా వెలుగులోకి వస్తారని, అప్పుడు భారత ప్రభుత్వం వారి సంగతి తేలుస్తుందని వ్యాఖ్యానించారు.

‘ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ పదవికి ఎన్నికలు ఉండవు. సంఘంలో సాధారణంగా ఎవరికైనా 75 ఏళ్లు నిండితే పదవి విరమణ చేస్తారు. ఇప్పుడు నాకు 75 ఏళ్లు నిండాయి. ఈ విషయాన్ని మా సంఘ్ దృష్టికీ తీసుకెళ్లాను. కానీ, మా సంఘ్ నన్ను ఆ పదవిలోనే కొనసాగుతూ పనిచేయాలని కోరింది. సంఘ్ ఎప్పుడు నన్ను పదవి నుంచి వైదొలగాలని కోరినా, నేను వైదొలగడానికి సిద్ధంగా ఉన్నానుసంఘ్ ఎప్పటికీ కులాలకు ప్రాధాన్యం ఇవ్వదు. ఎస్సీ, ఎస్టీల మీద వివక్ష లేదు.

సంఘ్ బ్రాహ్మణులు స్థాపించిన సంస్థ అయినప్పటికీ ఎవరైనా సంఘ్‌కు అధ్యక్షుడు కావొచ్చు’ అని స్పష్టం చేశారు. సావర్కర్‌కు భారతరత్న ఇస్తే, ఆ పురస్కారానికే గౌరవం పెరుగుతుందని కొనియాడారు. పురస్కారం ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంపై ఆర్‌ఎస్‌ఎస్ ఎప్పటి నుంచో గళాన్ని వినిపిస్తూనే ఉందని గుర్తుచేశారు. ఈ వేడుకలకు బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, నటీమణులు రవీనా టాండన్, శిల్పాశెట్టి హాజ రయ్యారు.