మమతను దేశం క్షమించదు
రాష్ట్రపతి పర్యటనలో బెంగాల్ ప్రభుత్వం అన్ని హద్దులు దాటింది
పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ ఉల్లంఘన
మమతా బెనర్జీపై ప్రధాని మోదీ ఆగ్రహం
మమతా ప్రభుత్వం తన పరిధి దాటిందన్న కిషన్‌రెడ్డి
కోల్‌కతా, మార్చి 8 : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటనలో ము ఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ ఉల్లంఘనలు, కచోట జరగాల్సిన సదస్సును హఠాత్తుగా మరోచోటుకు మార్చడంపై మోదీ మండిపడ్డారు. మమతా బెనర్జీ అన్ని హద్దులు దాటారని, దేశం ఆమెను క్షమించదన్నారు. రాష్ట్రపతికి జరిగిన అవమానానికి ప్రభుత్వ యంత్రాంగానిదే బాధ్యత అన్నారు.
ఇది సిగ్గుచేటు విషయమని, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. ప్రజాస్వా మ్యం, గిరిజన వర్గాల సాధికారతపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరి నైతికస్థైర్యాన్ని దెబ్బతీసేలా మమతా బెనర్జీ చర్య ఉందని ఆరోపించారు. మమతా బెనర్జీ తీరుతో గిరిజన వర్గానికి చెందిన రాష్ట్రపతి పడిన ఆవేదన దేశ ప్రజల మనసుల్లో అపార దుఃఖాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
అసలేం జరిగిందంటే..
పశ్చిమ బెంగాల్ వేదికగా 9వ అంతర్జాతీయ సంతాల్ సదస్సు శనివారం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. దేశ రాష్ట్రపతి హోదాగా ముర్ము పశ్చిమ బెంగాల్‌కు వెళ్లారు. అయితే, సీఎం మమతా బెనర్జీ, ఆమె కేబినెట్ సహచరులు ఎవ్వరూ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఇక ప్రొటోకాల్ ప్రకారం ఎయిర్ పోర్టులో ముర్ముకు వారెవ్వరూ స్వాగతం పలకలేదు. ఈ సమావేశానికి భారీగా ప్రజలు హాజరుకారని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. దాంతో ఈ సదస్సు వేదికను మరో ప్రాంతానికి మార్చిం ది. మొత్తం ఈ వ్యవహారంతో మమతపై బీజేపీ ఆరోపణలు చేసింది.
మమతా ప్రభుత్వం తీరు దురదృష్టకరం : కిషన్‌రెడ్డి
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పశ్చిమ బెంగాల్ గడ్డపై మమతా బెనర్జీ ప్రభుత్వం అవమానించడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇది అత్యంత దురదృష్టకర సంఘటన అని పేర్కొన్నారు. బెంగాల్ ప్రభుత్వం తన పరిధిని దాటి వ్యవహరించిందని ఆరోపించారు.
రాష్ట్రపతి పట్ల ప్రభుత్వం తీరు, గిరిజన సదస్సు వేదికను హఠాత్తుగా మార్చడం వంటి పరిణామాలతో వారు గిరిజన సమాజాన్ని, వారి సం స్కృతి సంప్రదాయాలను కూడా అవమానించినట్లే అని మండిపడ్డారు. రాష్ట్రపతి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి లేదా ఆ రాష్ట్ర మంత్రులు పాల్గొనడం కనీస మర్యాద అని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ ప్రభు త్వం ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిందని అన్నారు.
కేంద్రానివి కుట్రపూరిత ఆరోపణలు: మమతా బెనర్జీ
రాష్ట్రపతి ముర్ము వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ తనదైన శైలిలో స్పందించారు. కేంద్రప్రభుత్వం కుట్రపూరితంగానే తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఇవి బీజేపీ ఆదేశాలతో.. రాజకీయ పరమైనవని ముర్మువ్యాఖ్యలను సీఎం మమతాబెనర్జీ పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని.. అలాంటివేళ మోదీ నేతృత్వంలోని బీజేపీ దూకుడుగా వ్యవ హరిస్తోం దంటూ, ఎన్నికల్లో లబ్ధికే అత్యున్నత పదవిని దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహించారు.
మీరెందుకు రాలేదు?
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగా ల్ పర్యటనకు సంబంధించి సరైన ఏర్పాట్లు చేయకపోవడం కేంద్రం ఆగ్రహించింది. రాష్ట్రానికి రాష్ట్రపతి వస్తే.. సీఎం, మంత్రులు కనీసం పట్టించుకోరా అన్నారు. దీనికి సమాధానం చెప్పాలంటూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నందినిచక్రవర్తిని కేందహోంసెక్రటరీ గోవిం ద్ మోహన్ వివరణ కోరారు. ఆదివారం ౫ గంటల్లోగా చెప్పాలని ఆదేశించారు.
అదొక ప్రైవేట్ ఆర్గనైజేషన్
సీఎం మమతా సిలిగురిలో జరిగిన 9వ అంతర్జాతీయ ఆదివాసీ సంతల్ సమావేశానికి రాష్ట్రపతిని ఆహ్వానించారు. అంతర్జా తీయ సంతల్ కౌన్సిల్ అనేది ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఫోన్ ద్వారా కూడా తెలియజేశాం. రాష్ట్రపతిని మేయర్ సిలిగురి మున్సిపల్ కార్పొరేషన్, డీఎం డార్జిలింగ్ సిలిగురి పోలీ స్ కమిషనరేట్ స్వాగతించి, వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి సచివాలయం ఆమోదించిన లైనప్ ప్రకారం ఇది జరిగింది. ఈ లైనప్‌లో కానీ వేదిక ప్రణాళికలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి భాగం కాలేదు. జిల్లా యం త్రాంగం వైపు నుంచి ఎటువంటి ప్రొటోకాల్ ఉల్లంఘన జరగలేదు’ అని మమతా ట్వీట్ చేశారు.




