26 April, 2026 | 3:33 PM

జర్నలిస్ట్, రాజకీయ నాయకులు వేరుకానే కాదు

26-04-2026 02:20 PM

చేస్తున్నా సహాయం ను వక్రీకరించి చూడకండి 

జర్నలిస్ట్ లు నా కుటుంబ సభ్యులని భావిస్తున్నాను 

పాలమూర్ ను ప్రశాంతంగా ఉండేలా సహకారం చేయండి 

మీ కలంకు ముగింపు లేదు... రాజకీయం శాశ్వతం కాదు 

ఎల్లప్పుడు జర్నలిస్టులే సమాజ శ్రేయస్సుకు పరితపిస్తారు 

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): జర్నలిస్టులు రాజకీయ నాయకులు వేరు కాదని ఇద్దరు పక్కపక్కనే ప్రజాసాక్షుల కోసం పరితపిస్తూ ప్రయాణిస్తుంటారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రౌండ్ గార్డెన్ నందు ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే జర్నలిస్టుల ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడారు. జర్నలిస్టులకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రతి సమస్యకు పరిష్కారం చూపించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

చేస్తున్న మంచిని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని తప్పులు జరిగితే కూడా వాడిని సరిచేపించే బాధ్యత కూడా జర్నలిస్టులకు ఉందని తెలిపారు. మంచి చేయాలని సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ఒంటరిగా రాజకీయాలకు వచ్చానని అందరికీ మేలు చేయాలని సంకల్పంతోనే అడుగులు వేస్తున్నానని, గుంపుగా రాలేదని  స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న గర్భిణీ మహిళలకు యెన్నం హెల్త్ కిట్టు కారులను పంపిణీ చేయడం జరిగిందని వారికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఓపెనింగ్ ఉచితంగా చూస్తుండడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే 850 కిట్లను పంపిణీ చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరికి మేలు చేయాలని ఉద్దేశంతో అడుగులు వేస్తున్నామని తెలిపారు.

ప్రెస్ క్లబ్ కు ప్రింటర్, కంప్యూటర్ లను ఇప్పించడం జరుగుతుందన్నారు. మన బాధ్యత ను మరిస్తే మన తల్లి ని చంపుకున్నట్టు అని విమర్శించారు. ప్రస్తుత సమాజం లో రాజకీయ నాయకుల, జర్నలిస్ట్ ల విలువ తగ్గుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఎ సమస్య ఉన్న సౌకర్యాలు లేకపోతే మీరు రాయాలన్నారు. ఇష్టాను సారంగా ఇదే గొప్ప అనుకుంటే సమాజం తిరగబడుతున్నాదన్నారు. తులసి మొక్క మాదిరిగా జీవనం కొనసాగించాలని పేర్కొన్నారు. పదవి లేకపోయిన మన జనం లో బతికి ఉండాలన్నారు. విలువల కమిటీ వేసుకోవాల్సిన అవసరం అవుతుందన్నారు. మీరు రాసే వ్యాసాలు బాగా రాయలని, మీతో కలిసి పని చేయాలని పేర్కొన్నారు.

సూచనలు, సలహాలు వస్తేనే రాజకీయ నాయకులు సరిగ్గా నడుస్తారని తెలిపారు. ఎవరి బాధ్యత ఉండేలా చూడాలని పేర్కొన్నారు. రాజకీయ నాయకులకు ఇగో లు ఉండవని, మీకు ఎందుకు అని పేర్కొన్నారు. 20 వేల విద్యార్థుల జీవితలలో మార్పు లు కల్పించేందుకు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. మహబూబ్ నగర్ మొదటి స్థానంలో ఉండాలని,  ఏటీసీ సెంటర్ లో నూతన మిషన్ లు వచ్చాయని, 95శాతం విద్యార్థులు ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.  సన్న బియ్యం వస్తుందని,మంచి పనులను చేస్తున్నామని తెలిపారు.