26 April, 2026 | 4:03 PM

ఉచిత అంబలి పంపిణీ కేంద్రాలు ప్రారంభం

26-04-2026 02:29 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): ఎండల తీవ్రత దృష్ట్యా మంచిర్యాల నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చడానికి కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంబలి పంపిణీ కేంద్రాలను మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల బస్టాండ్, మార్కెట్, ఐబీ చౌరస్తా, హమాలీవాడ, సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీ ఏరియాల్లో ఉచిత అంబలి పంపిణీ కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.