18 July, 2026 | 2:36 AM

పంపుహౌస్‌లో దొంగలు

18-07-2026 02:23 AM

పాలకుల వైఫల్యమన్న బీఆర్‌ఎస్

చిన్నంబావి, జూలై 17: మండల పరిధిలోని చిన్నమారూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పంపుహౌస్ ట్రాన్స్ ఫార్మర్ లో కాపర్ వైర్లు చోరీకి గురైన నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ మండల నాయకులు శుక్రవారం పంపుహౌస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మండలంలో వరుస దొంగతనాలు, హత్యలే ప్రధానంగా జరుగుతున్నాయని అలాంటి ఘటనలే పునరావృతంగా ఇటీవల పంపు హౌస్ లో కాపర్ వైర్లను దొంగలించడం విడ్డూరంగా ఉందని, ఇలాంటి ఘటనలపై మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఈ పంపు హౌస్ ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి రైతులకు యధా విధంగా  సాగునీరు అందేలా కృషి చేయాలని, లేనియెడల మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నాలు, కార్యాలయాలను మండల రైతులతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ,మాజీ జడ్పీటీసీ వెంట్రావమ్మ,ఈదన్న యాదవ్,శ్రీధర్ రెడ్డి,మధు,తగరం కురుమయ్య, డేగ శేఖర్, శివ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.