భద్రాద్రి అభివృద్ధి పనులకు శ్రీకారం
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయం లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదట విడతగా గా 351 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి చేపట్టిన అభివృద్ధి పనులలో భాగంగా ఆదివారం ఉదయం జీర్ణోద్ధరణ కళావాహన కార్యక్రమాలకు త్రిదండి చిన జీయర్ స్వామి పూజలు నిర్వహించారు.
.ఆలయంలోపల ఉన్న ఉపాలయాలకు శ్రీలక్ష్మి తాయారు అమ్మవారు, గోపుర ప్రాకారాలకు జీర్ణోద్ధరణ కళావాహన పూజా కార్యక్రమాలను జీయర్ స్వామి పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయం లోపల ఉన్న అన్ని ఆలయాల విగ్రహాలకు, ప్రాకారాలకు జీర్ణోద్ధరణ కళావాహన పూజా కార్యక్రమాలు ఘనంగా వేద మంత్రోచ్ఛారణల నడుమ మేళతాళాల మధ్యలో పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఋత్వికులూ. ఆలయ ఈఓ దామోదర్ రావు దంపతులు ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.






