7 August, 2026 | 4:50 PM

Breaking News

క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి   •   వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల   •   అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి   •   విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత   •   అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు   •   గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   ఆరేళ్ల నిరీక్షణకు తెర.. మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం 4వ యూనిట్   •   అర్బన్ రెసిడెన్షియల్ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్   •   డీసీఎంను ఢీకొన్న ద్విచక్రవాహనం   •  

జీపీ, మహిళా సమైక్య భవనాలకు భూమిపూజ

18-07-2026 02:21 AM

గట్టు, జూలై 17: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి ఆర్‌అండ్‌ఆర్ సెంటర్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనం, మహిళా సమైక్య భవనాలకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గట్టు మాజీ ఎంపీపీ జె. విజయ్ కుమార్, సర్పంచ్ ఉప్పరి దేవేందర్తో కలిసి భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా జె. విజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో గ్రామపంచాయతీ భవనం, మహిళా సమైక్య భవనం కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. భవనాల నిర్మాణం పూర్తయితే ప్రజలకు పరిపాలనా సేవలు మరింత సులభంగా అందుతాయని, మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.