4 May, 2026 | 4:10 AM

శ్రీ అభయాంజనేయ ఆలయానికి పంచలోహ విగ్రహాల బహూకరణ

04-05-2026 01:40 AM

విగ్రహాలను బహుకరించిన గుగులోతు రవి(బెల్ రవి) దంపతులు.

కారేపల్లి, మే 3 (విజయ క్రాంతి): సింగరేణి మండల పరిధిలోని వెంకట్యతండా గ్రామంలో కొలువై ఉన్న శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయానికి,భల్లునగర్ తండా గ్రామానికి చెందిన గుగులోత్ రవి దంపతులు రూ.1,07,116 విలువ చేసే సీతారామ,లక్ష్మణ,ఆంజనేయ స్వామి పంచలోహ విగ్రహాలను వితరణగా అందజేశారు. దంపతులు స్వామివారి కల్యాణం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్పగా ఘనంగా నిర్వహించిన దైవ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.

అనంతరం మాజీ ఎంపీపీ బానోత్ దేవ్లా నాయక్ మాట్లాడుతూ గ్రామంలో మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించిన దైవ కార్యక్రమాల ద్వారా వెంకట్యతండా గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ బుల్లి, మంగళం కంపెనీ ఎండీ గుగులోతు రాజేందర్, మాజీ సర్పంచులు, వెంకట్యతండా గ్రామస్తులు, ఉద్యోగస్తులు,యువత తదితరులు పాల్గొన్నారు.