3 July, 2026 | 4:32 PM

మండల వ్యాప్తంగా కురిసిన వర్షం... రైతుల్లో ఆనందం

03-07-2026 03:39 PM

సిద్దిపేట: బెజ్జంకి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం విస్తారంగా వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి సరైన వర్షాలు లేక ఆందోళనలో ఉన్న రైతులకు ఈ వర్షం ఊరటనిచ్చింది. ఇప్పటికే విత్తనాలు వేసిన పత్తి, మొక్కజొన్న, వరి తదితర పంటలకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.