3 July, 2026 | 5:29 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

04-05-2026 01:38 AM

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

బూర్గంపాడు,మే3,(విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మారుమూల అటవీ గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు  అన్నారు. ఆదివారం బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం, ముసలిమడుగు గ్రామపంచాయితీ పరిధిలో రూ.2కోట్ల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు,గ్రావెల్ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు,

అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందించేలా చూస్తున్నామన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తూ ముందుకు సాగుతోందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జమలారెడ్డి,పిఆర్ ఏఈ చక్రధర చారి,సర్పంచులు బాదం వెంకటేశ్వర రెడ్డి,పూనెం సురేందర్, మందా నాగరాజు, లక్ష్మీపురం ఉపసర్పంచ్ యారం పున్నారెడ్డి,మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.