3 July, 2026 | 4:16 PM

జులై 3 నుండి అనస్థీషియా లజిస్టిల వార్షిక సమావేశం

03-07-2026 03:36 PM

ముకరంపుర,(విజయక్రాంతి): ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్తీషీయాలజిస్ట్ వారి 11వ వార్షికోత్సవ సమావేశం ఈనెల 3,4,5 తేదీలలో జరగనుంది. శుక్రవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహక చైర్మన్ డాక్టర్ అనమల్ల నరేష్ మాట్లాడుతూ ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్తీషీయాలజిస్ట్ లో 11 వ వార్షిక సమావేశం కరీంనగర్ జిల్లా ప్రతిమ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నగునూరు నందు ఈ నెల 3 నుండి 5 వరకు నిర్వహిస్తున్నామని తెలియజేశారు.

ఈ సమావేశానికి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కె రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కె. సత్యనారాయణ, ప్రతిమ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ బోయిన్పల్లి హరిణి, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ తాకియుద్దీన్ ఖాన్ లు అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో ప్రముఖ అధ్యాపకులు, అనుభవజ్ఞులైన వైద్యులు, పరిశోధకులు, యువ అనస్తీషీయాలజిస్టులను ఒకే చోట చేర్చి నిరంతరం అభివృద్ధి చెందుతున్న ఈ అనస్తీషియాలజీ రంగంలో జ్ఞానం,ఆవిష్కరణలు, మరియు ఉత్తమ పద్ధతులను సమావేశం ద్వారా పంచుకుంటామని తెలియజేశారు. ఈ విలేకర్ల సమావేశంలో ఐ ఎస్ ఎ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.