కోంపల్లి సర్కిల్ పరిధిలో జోరుగా అక్రమ నిర్మాణాలు
- మున్సిపాలిటీలు మారుతున్నా... అధికారుల తీరు మారేదెలా?
- అక్రమాల రాజ్యంలో అధికారుల కాపలా
- కంటితుడుపు చర్యలతో కాలం గడుపుతున్న అధికారులు
- ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపం.. స్థానికుల పట్ల శాపం
కుత్బుల్లాపూర్, మే 3 (విజయక్రాంతి): ఇందుగలడందులేడని సందేహము వలదు, ఎందెందు వెదకి చూచిన నందందే గలడు అనే పోతన భావం సరిగ్గా అద్దం పట్టినట్టు ఉంటుంది పట్టణ ప్రణాళిక అధికారుల తీరుకి.. ఆ మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీ.. ఏ మున్సిపాలిటీలో చూడు అక్రమ అధికారులే దర్శనమిస్తున్నారు అనడంలో అతిశ యోక్తి లేదు. గ్రేటర్ పరిధిలో అక్రమ నిర్మాణాలు రాజ్యమేళుతుంటే కాసుల కక్కుర్తిలో అధికారులు వాటికి కాపలా కాస్తున్నారు అనే విమర్శలు ఊపందుకుంటున్నాయి.
వివరాల్లోకి వెళితే పరిపాల సౌలభ్యం అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ పరిధిని విస్తరిస్తూ కొన్ని మున్సిపాలిటీలను విలీనం చేసిన విషయం విధితమే. పరిపాలన సౌలభ్యం పక్కన పెడితే... అధికారుల అక్రమార్జన సౌలభ్యం కొరకే విలీనం జరిగిందా అనే అనుమానాలు స్థానికుల నుండి వ్యక్తం అవుతున్నాయి.కొంపల్లి సర్కిల్ -56 లోని పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు, షెడ్లు కమర్షియల్ నిర్మాణాలు వెలుస్తున్న అధికారులు కంటి తుడుపు చర్యలతో కాలం గడుపుతున్నారని స్థానికులు పెదవి విరుస్తున్నారు.
మున్సిపాలిటీ నుండి సిబ్బంది కొరతతో సతమవుతున్న... విలీనం అనంతరం పరిధి పెరగడం అధికారులకు ఒక రకంగా సవాలుగా మారిన కూడా మరోరంకంగా లాభదాయకంగా మారిందనే విమర్శలు సైతం లేకపోలేదు. పరిధి పెరగడంతో పాటు అక్రమ నిర్మాణాల సంఖ్య కూడా పెరగడంతో ప్రస్తుతం కొంపల్లి సర్కిల్ -56 పట్టణ ప్రణాళిక విభాగంలో అక్రమ నిర్మాణాల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీ శైలజ హాస్పిటల్ పక్కన అక్రమ సెల్లార్, అదనపు అంతస్తు నిర్మాణం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
అక్రమాల రాజ్యంలో.. అధికారుల కాపలా?
కొంపల్లి సర్కిల్ -56, సుభాష్ నగర్ పరిధిలోని ప్లాట్ నం. 416, సర్వే నం. 240లో సుమారు 500 గజాల స్థలంలో ఓ వ్యక్తి 2024 డిసెంబర్ లో స్టిల్ట్+3 భవన నిర్మాణానికి అనుమతులు పొందాడు. బహిరం గంగానే నియమాలు తుంగ లో తొక్కుతూ సెల్లార్‌తో పాటు అదనంగా మరో అంతస్తు నిర్మా ణం చేస్తున్నాడు. ఇదే విషయంపై అప్పటి కుత్బుల్లాపూర్ సర్కిల్ (విలీనం జరగకముందు) పట్టణ ప్రణాళిక అధికారులు హడావుడి చేసి నిర్మాణ పనులు నిలిపి వేసిన కొన్ని రోజులకే అక్రమ నిర్మాణ పనులు మళ్ళీ చేపట్టారు.
అనంతరం పట్టణ ప్రణాళిక అధికారులు మారిన తరువాత కూడా యధావిధిగా హడావుడి చేసి నామమాత్రంగా నిర్మాణ పనులు నిలిపివేసిన తిరిగి నిర్మాణ పనులు కొనసాగే విధంగా అధికారులను సదరు నిర్మాణధారుడు ప్రభావితం శాడు అనే ఆరోపణలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నా యి. ఇదే తరు ణంలో గ్రేటర్ విస్తీర్ణం చేయడంతో కొంపల్లి మున్సిపాలిటీ నుండి కొంపల్లి సర్కిల్ -56 గా ఏర్పడింది.
ఇప్పుడైనా రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ, ప్రమాదకరంగా నిర్మాణం జరుగుతు నటువంటి సదరు అక్రమ నిర్మాణంపై కొంపల్లి సర్కిల్ అధికారులైన చర్యలు తీసుకుంటారు అని అనుకున్న స్థానికుల ఆశలు ఆవిరి అయినట్టే కనిపిస్తుంది. ప్రస్తుతం కొంపల్లి సర్కిల్ -56 పట్టణ ప్రణాళిక అధికారిని ఏసీపీ వాణి సైతం సర్కిల్ నూతంగా ఏర్పడిన తర్వాత నిర్మాణ పనులు హడావిడి చేసి జోనల్ కమిషనర్ ఆదేశాలు అంటూ నిలిపివేసిన ఇప్పుడు కూడా యధావిధిగా నిర్మాణ పనులు కొనసాగడంతో స్థానికులను విస్మయానికి గురి చేసింది.
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపి ఫిర్యాదులు అందిన వెంటనే చర్యలు తీసుకునే ఏసీపీ వాణి సైతం సదరు అక్రమ నిర్మాణ విషయంలో వెనకడుగు వేయడంతో నిర్మాణ ధారుడి పలుకుబడి లేదా చీకటి ఒప్పందాలతో అధికారులే అక్రమాలకు కాపలా కాస్తున్నారా అనే ప్రశ్నలు స్థానికంగా తలెత్తున్నాయి.
ఇదే విషయంపై ఏసీపీ వాణిని వివరణ కోరగా విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటాం అని తెలిపిన కొన్ని రోజులకు మళ్ళీ వివరణ కోరితే ఉప కమిషనర్ వివరణ తీసుకోండి అంటూ దాటివేయడం స్థానికంగా నెలకొన్న ఆరోపణలకు మరింత ఊతం ఇచ్చినట్టు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఉప కమిషన్ రామకృష్ణ రెడ్డిని వివరణ కోరేందుకు పలు మార్లు కలవడానికి కార్యాల యంలో అందుబాటులో లేరు. ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు.






