సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట
03-07-2026 04:25 PM
కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి ప్రధాన కార్యాలయము నందు కొలువై ఉన్న,దుర్గామాత గుడి నందు శుక్రవారము నాడు,శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ను అత్యంత అంగరంగ వైభముగా నిర్వహించారు. మూడు రోజులపాటు అనగా 01.07.2026 నుండి 03.07.2026 వరకు అత్యంత వైభముగా నిర్వహించిన విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమములో, భక్తి శ్రద్ధలతో అధికారులు, ఉద్యోగులు, ఒప్పోంద కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. విగ్రహ ప్రతిష్ట అనంతరం నిర్వహించిన సహపంక్తి బోజనాలలో,కార్పొరేట్ పరిధి లోని అధికారులు ఉద్యోగులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.






