22 July, 2026 | 4:23 AM

వర్షపు నీరు వృధా పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

22-07-2026 12:55 AM

తాడ్వాయి,జూలై, 21( విజయ క్రాంతి): వర్షపు నీరు వృధాగా పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తాడ్వాయి ఎంపీడీవో భరత్ కుమార్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామంలో ఆయన మంగళవారం గ్రామంలోని బోరుబావిని, పల్లె ప్రకృతి వనాన్ని, వైకుంఠధామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షపు నీరు వృధాగా పోకుండా వుడిసి పట్టాలని సూచించారు. వర్షపు నీటిని కాపాడితేనే భావితరాలకు బాసటగా నిలుస్తామని తెలిపారు.

గ్రామంలోని ఐకెపి భవన నిర్మాణం పనులను పరిశీలించారు.నిర్మాణ పనులు వేగవంతంగా చేయాలని సూచించారు వైకుంఠధామంలో మొక్కలను పరిశీలించి మొక్కలు పెరిగేటట్లు చూడాలన్నారు. గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు  అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ సత్యనారాయణ, కార్యదర్శి జగన్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.