22 July, 2026 | 3:50 AM

జంగంపల్లి ప్రాథమిక పాఠశాలకు రూ.93,500 విలువైన డెస్క్-బెంచీల విరాళం

22-07-2026 12:54 AM

భిక్కనూర్, జూలై 21(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం జంగంపల్లి ప్రాథమిక పాఠశాలకు లిటిల్ రెడ్ జాంబిస్ రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ సన్రైజ్ ఆధ్వర్యంలో రూ.93,500 విలువైన 22 డెస్క్-బెంచీలను విరాళంగా అందజేశారు. క్లబ్ సభ్యులు గుమెడిల్లి శ్రీనివాస్, ప్రవీణ్ లునావత్ సహకారంతో ఈ విరాళం అందించారు.

గత ఏడాది నుంచి పాఠశాల యాజమాన్యం చేసిన విజ్ఞప్తికి స్పందించి విద్యార్థులకు కూర్చునే సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా దాతలకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అత్తెల్లి శ్రీనివాస్, సోమన్న బాలకిషన్, మహిపాల్ రెడ్డిలను అభినందించారు.