ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలో ‘సర్’ కార్యక్రమం
మేడ్చల్ అర్బన్, జూలై 21 (విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో ప్రత్యేక ఓటరు నమోదు అవగాహన కార్యమాలను కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు ఎర్రవల్లి విఘ్నేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్క పౌరుడు ఓటరుగా నమోదు కావాలని ఓటరు జాబితాలో పేర్లు చిరునామాలు ఇతర వివరాలను సరిచూసుకోని అవసరమైన మా ర్పులు చేసుకోవాలని ఆయన సూచించారు.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటు విలువైనదని సర్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని విఘ్నేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్‌లు ఎండి ఆరీఫ్, ముత్యాల గౌడ్, మాజి సర్పంచ్ సంజీవరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భవాని, వెంకటేష్ యాదవ్, బైండ్ల మురళి, మునిగొండ అశోక్, సల్ల కృష్ణ, పశువుల రమేష్, స్థానికులు పాల్గొన్నారు.






