ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి
15-06-2026 07:23 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): మండలంలోని కొత్త దొనబండ తండా పాఠశాల సోమవారం పునఃప్రారంభం సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు నిర్వహించారు.అనంతరం విద్యార్థిని, విద్యార్థులకు పుస్తకాలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా గ్రామ పెద్దలు,నాయకులు సహకరించాలని కోరారు.






