పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం
15-06-2026 07:31 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఇటీవల పాముకాటుకు మృతి చెందిన షటిల్ బ్యాడ్మింటన్ క్లబ్ అధ్యక్షుడు ఏనుగుల రాజేశ్వర్ కుటుంబానికి క్లబ్ సభ్యులు ఆర్థిక సహాయం అందజేశారు. సోమవారం అతని భార్య, తల్లికి క్లబ్ సభ్యులు రూ. 21300 నగదు ఆర్థిక సహాయము అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబానికి పెద్దదిక్కు పాముకాటుతో మృతి చెందడం బాధాకరమని, వారు ఆ కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు, షటిల్ క్లబ్ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.






