వేములవాడలో పూర్వ ప్రాథమిక పాఠశాలలు మంజూరు చేయాలి
టీపీటీఎఫ్
వేములవాడ, జూన్ 9 (విజయక్రాం తి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పూర్వ ప్రాథమిక పాఠ శాలల ఏర్పాటు కార్యక్రమంలో వేములవాడ అర్బన్, రూరల్ మండలాలకు ఒక్క పాఠశాల కూడా మంజూరు కాకపోవడం పట్ల టీపీటీఎఫ్ వేములవాడ మం డల శాఖలు ఆందోళన వ్యక్తం చేశాయి.
అవకాశం ఉన్న ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పూర్వ ప్రాథమిక పాఠశాలను మంజూరు చేయాలని కోరుతూ మండల విద్యాధికారి ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. చిన్నా రులకు నాణ్యమైన ప్రాథమిక విద్య అం దించాలంటే పూర్వ ప్రాథమిక విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో విస్తృతంగా అం దుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని టీపీటీఎఫ్ నాయకులు పేర్కొన్నారు.
అలాగే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదుల మరమ్మతులు, విద్యుత్ సదుపాయం వంటి మౌలిక వసతులను తక్షణమే కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో టీపీటీ ఎఫ్ మండల అధ్యక్షుడు కృష్ణ, ప్రధాన కార్యదర్శి మహేష్, జిల్లా కార్యదర్శి రామచంద్రం, రూరల్ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సంతోష్, రవి, లక్ష్మీనారాయణ, సుభాష్ పాల్గొన్నారు.






