10 June, 2026 | 5:05 AM

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

10-06-2026 12:00 AM

అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

వేములవాడ రూరల్, జూన్ 9 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వేములవాడ రూరల్ మండలంలోని నూకలమర్రి, నమిలిగుండుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రాల నిర్వాహకులు, రైతులతో మాట్లాడి కొనుగోళ్ల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.

ఇప్పటివరకు సేకరించిన ధాన్యం పరిమాణం, మిల్లులు మరియు గోదాములకు తరలించిన నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్న అదనపు కలెక్టర్, కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీలు, వర్షాల నేపథ్యంలో అందుబాటులో ఉన్న టార్పాలిన్ల పరిస్థితిపై ఆరా తీశారు. తూకం పూర్తయిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు అవసరమైన వాహనాలను సమకూర్చాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అలాగే రైతులు పంటల మార్పిడిపై దృష్టి సారించి లాభదాయక పంటలను సాగు చేయాలని సూచించారు.