15 June, 2026 | 8:42 PM

Breaking News

అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •  

చిట్యాలలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

24-03-2026 12:37 AM

చిట్యాల, మార్చి 23 : అసెంబ్లీ ముట్టడికి హైదరాబాద్ తరలివెళ్తున్న బిజెపి నాయకులను చిట్యాల ఎస్‌ఐ మామిడి రవికుమార్ నేతృత్వంలో పోలీసులు సోమవారం ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందని నిరసిస్తూ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు మేరకు చేపట్టిన ’అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమం చిట్యాలలో ఉద్రిక్తంగా మారింది.

ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రైతులు, మహిళలు, యువత, మరియు ఉద్యోగులను నిలువునా వంచించిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 వాగ్దానాలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, బిజెపి ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉండి పోరాడుతుందని స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన వారిలో బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు బిజెపి ప్రధాన కార్యదర్శి చుంచు శ్రీను, జిల్లా కౌన్సిల్ సభ్యులు కూరెల్ల శ్రీను, పాల రవి వర్మ, బెల్లి నరేష్, మురళీకృష్ణ, నూకేష్ తదితరులు ఉన్నారు.