సమస్యల పరిష్కారానికి ప్రజావాణి
30-04-2026 02:38 AM
భైంసా, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): సమస్యల పరిష్కారానికి పోలీసుల ప్రజావాణి ప్రతి బుధవారం బైంసాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పట్టణంలో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. చాలామంది కుటుంబ సమస్యలతో వస్తున్నారని వారికి కౌన్సిలింగ్ ద్వారా సమస్య పరిష్కరించి సాయం అందించడం జరుగుతుందన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న పోలీస్ శాఖను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సాయికిరణ్ జిల్లా పోలీసులు ఉన్నారు.






