బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డయ్
- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
- వికారాబాద్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
వికారాబాద్, సెప్టెంబర్- 1( విజయ క్రాంతి ) : లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ను నిరసిస్తూ అలాగే ఉత్తరాఖండ్ లో జరిగిన ఘటనకు బాధ్యులైన బిజెపి కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎఐసిసి పిలుపు మేరకు మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో డిసిసి అధ్యక్షుడు ధారాసింగ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.
అనంతరం తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతోనే బిజెపి ప్రభుత్వం రాహుల్ గాంధీ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిందన్నారు. ఉత్తరాఖండ్ ఘటనకు బాధ్యులైన బిజెపి కార్యకర్తలపై చర్యలు తీసుకునేంత వరకు పోరాటం సాగుతుందన్నారు. రాహుల్ గాంధీ పై అకారణంగా కేసు పెట్టడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనను యావత్ దేశం ఖండిస్తుందన్నారు.
ఎక్కడ తప్పు జరిగిన ప్రశ్నిస్తున్నందుకు ప్రభుత్వం రాహుల్ గాంధీ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. కేసులకు కాంగ్రెస్ పార్టీ భయపడేది లేదన్నారు. ఇక బిజెపి పప్పులు ఉడకవున్నారు. దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలర్పించారన్నారు. ప్రధాని అయ్యే అవకాశం ఉన్న నాడు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రి చేశారని గుర్తు చేశారు. ఏనాడు ఆ కుటుంబo పదవులు ఆశించలేదన్నారు.
కాంగ్రెస్ తోనే పేద, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. మోడీ అధికారంలో వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. ఇప్పటికీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. జీరో అకౌంట్ లో ఇప్పటి వరకు ఎంతమంది పేదలకు డబ్బు లు జమ చేశారని ఆయన ప్రశ్నించారు.
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీయే నన్నా రు. ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యులు సం తోష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అనన్య, AMC చైర్మన్లు శ్రీనివాస్, వడ్డే శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మ న్ సుధాకర్ రెడ్డి, సత్యనారాయణ, కిషన్ నాయక్ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.






