7 March, 2026 | 1:25 AM

ప్రొఫెసర్లు విద్యార్థులు ప్రతిజ్ఞ

06-03-2026 04:58 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన కార్యక్రమం శుక్రవారం ప్రారంభం అయ్యింది.  కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సుధాకర్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు విద్యార్థులు కళాశాల సిబ్బంది ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఈ రోజు ప్రజాపాలన కోసం కళాశాలలో కమిటీలు వేసి 9 రోజుల కార్యక్రమం కార్యాచరణ రూపొందించారు. ఈ రోజు కార్యక్రమం గార్డెన్ పరిశుద్ధ పరిచి నివేదికలు సీసీకి సమర్పించారు. ఈ కార్యక్రమం అంతా ఎన్సీసీ, ఎన్స్స్, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.