అడవి సోమన్ పల్లి గ్రామాన్ని శ్రీపాదరావు పల్లెగా మార్చండి
జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన అడవి సోమనపల్లి గ్రామస్తులు
మంథని,(విజయక్రాంతి): గతంలో వరదలతో దిక్కు తోచని స్థితిలో ఉన్న మా ఊరికి గూడు, నీడనిచ్చిన అండగా నిలిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు పేరును మా అడివి సోమన్ పల్లి ఊరికి పెట్టాలని మంథని మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సేగ్గం రాజేష్ జిల్లా కలెక్టర్ శ్రీకోయ శ్రీహర్షకు వినతి పత్రంలో గ్రామ ప్రజలతో కలిసి కోరారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంథని మండలం అడవి సోమనపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు సేగ్గం రాజేష్ మాట్లాడుతూ... 1989-90 ప్రాంతంలో మా ప్రాంతానికి వరదలు వచ్చినప్పుడు మా ప్రాంతం దిక్కుతో స్థితిలో ఉన్న సందర్భంలో స్వర్గీయ శ్రీపాద రావు సార్ మా గ్రామాన్ని ఆదుకొని ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న ప్రాంతానికి తరలించి 350 ఇండ్లు ఇప్పిచ్చి మా అందరికీ న్యాయం చేశారు.
అలాంటి గొప్ప నాయకుడి పేరును మా ఊరికి ఉండడం మాకు సంతోషంగా ఉంటుందని, తక్షణమే ప్రభుత్వం మా ఊరి పేరును శ్రీపాద రావు పల్లెగా మార్చి మా ఊరి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడవి సోమనపల్లి సర్పంచ్ గట్టు దామోదర్ గౌడ్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, రాజు, జనార్ధన్, మహేష్, వినోద్, శివ ,కార్యకర్తల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




