2 May, 2026 | 5:15 PM

ప్రజా పాలనలో గ్రామాల, పట్టణాల అభివృద్ధి యే లక్ష్యం..!

02-05-2026 04:01 PM

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..!

షాద్‌నగర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా శనివారం షాద్ నగర్ పట్టణంలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ లో ఆర్డిఓ సరిత అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  హాజరైన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ... కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని, విద్య వైద్యం తో పాటు రైతులకు రైతు భరోసా రైతు బీమా అవసరమైన రైతన్నకు ట్రాన్స్ఫార్మర్లు అందిస్తున్నామని అన్నారు.

విద్యా వైద్యానికి పెద్ద పీఠ వేస్తున్నామని గురుకులాల్లో, పాఠశాలలో, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులొ ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నామని గ్యాస్ సిలిండర్ ఉచిత విద్యుత్ వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు. కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తో నిరుపేదల ఆడపిల్లలకు పెళ్లి కానుకగా సహాయం అందిస్తున్నామన్నారు.

ఈ సందర్బంగా రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి మాట్లాడుతూ... నేటి సమాజంలో రకరకాల వ్యాధులు వస్తున్నాయని ముఖ్యంగా మహిళలు గతంలో రొమ్ము క్యాన్సర్ లాంటి వ్యాధి బారినపడి తీవ్ర ఇబ్బందులు పడ్డారని నేడు రకరకాల వ్యాధులు దరిచేరే అవకాశం ఉందని ఆరోగ్యంపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలన్నారు. అదేవిధంగా అతివేగం ప్రమాదానికి కారణం అవుతుందని ఆ రోడ్డు ప్రమాదంలో మనం కూడా ఉండవచ్చని కాబట్టి ట్రాఫిక్ నియమాలు పాటించి వాహనాలను నడపాలని సూచించారు సైబర్ క్రైమ్ బారిన పడి ఎంతో మంది మోసపోతున్నారని తమ ఆధార్, ఓటిపి, గుర్తు తెలియని వ్యక్తులకు చెప్పకూడదని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి ఫంక్షన్ హాల్ ఆవరణలో ఏర్పాటుచేసిన వివిధ రకాల స్టాల్స్ ను పరిశీలించారు.