కలివేరులో ‘ప్రజా పాలన- ప్రగతి పథం’ గ్రామ సభ విజయవంతం
ముఖ్యఅతిథిగా ఆత్మ కమిటీ చైర్మన్ ఇందుల బుచ్చిబాబు
చర్ల, జూన్ 7 (విజయక్రాంతి): చర్ల మండలం కలివేరు గ్రామంలో సోమవారం ’ప్రజా పాలన - ప్రగతి పథం’ కార్యక్రమంలో భాగంగా 10 రోజుల గ్రామ సభల కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్ర మానికి ఆత్మ కమిటీ చైర్మన్ ఇందుల గోపా ల బుచ్చిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ బుచ్చిబాబు మాట్లాడుతూ, గ్రామ సభల ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో తాగునీరు, విద్యుత్తు, పచ్చదనం, పరిశుభ్రత, ఆరోగ్యం, ఇందిరమ్మ ఇళ్లు వంటి కీలక అంశాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడమే అని తెలిపారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురికినీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు.
మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వారానికి రెండు రోజులు ’డ్రైడే’గా పాటించాలని, పరిసరాలను శుభ్రంగా ఉం చుకోవాలని పిలుపునిచ్చారు. తాగునీటిని తప్పనిసరిగా మరగబెట్టి, చల్లార్చి తాగాలని సూచించారు ఏవైనా సమస్యలు ఎదురైతే గ్రామంలో అందుబాటులో ఉండే ప్రభుత్వ ఉద్యోగులను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు రైతులకు ప్రభుత్వం కేటాయించిన రూ.500 బోనస్, విత్తనాల పంపిణీ గురించి వివరించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






