సీఎం ఫ్యూచర్ సిటీ పర్యటనను విజయవంతం చేయాలి
‘కొత్తపేటలోని ‘పాపడం బ్లూ’ హోటల్లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం
నాగోల్, జూన్ 8 (విజయక్రాంతి): ఈ నెల 10వ తేదీన ఫ్యూచర్ సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిష్టా త్మకంగా నిర్మించిన డెవలప్మెంట్ అథారిటీ, స్కిల్ యూనివర్సిటీల ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో, సీఎం పర్యటనను విజయవంతం చేయడమే లక్ష్యంగా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం కొత్తపేటలోని ‘పాపడం బ్లూ’ హోటల్లో నిర్వహించారు.
ఈ సమావేశంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న లక్ష్మారెడ్డి, టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని మహేందర్ యాద వ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన డెవలప్మెంట్ అథారిటీ, స్కిల్ యూనివర్సిటీల ప్రారంభోత్సవం రాష్ట్ర అభివృద్ధికి నాంది పలికే కార్యక్రమమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని రామకృష్ణ పురం, ఎన్టీఆర్ నగర్, సరూర్నగర్, డాక్టర్స్ కాలనీ డివిజన్ల నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






