13 March, 2026 | 4:35 PM

ఎండిపోతున్న పంటలు.. కాలిపోతున్న మోటర్లు..

13-03-2026 12:38 AM

నంగునూరు మండలంలో మొదలైన విద్యుత్ కష్టాలు 

సాగునీరు అందక పశుగ్రాసంగా మారుతున్న వరి పంటలు

నంగునూరు, మార్చి 12: వేసవి కాలం సెగలు మొదలవ్వకముందే నంగునూరు మండలంలో సాగు కష్టాలు రైతులకు శాపం గా మారాయి.ఒకవైపు అప్రకటిత విద్యుత్ కోతలు, మరోవైపు తీవ్రమైన లో-వోల్టేజీ స మస్యలతో రైతాంగం విలవిలలాడుతోంది. సాగునీరు అందక పచ్చని పంటలు కళ్లముం దే ఎండిపోతుంటే,ఆ పంటను కాపాడుకోవడానికి వేసిన మోటర్లు విద్యుత్ హెచ్చుత గ్గుల వల్ల కాలిపోతుండటంతో రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు.

పశుగ్రాసంగా మారుతున్న వరి.. అప్పుల ఊబిలో రైతు మండలంలోని వాగవుతల, అక్కెనపల్లి, గట్లమల్యాల, కొండంరాజుపల్లి, ఘనపూర్, ఖాతా తో పాటు పలు గ్రామాల్లో గత కొన్ని రోజులుగా విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది.గంటల వ్యవధిలోనే పదుల సంఖ్యలో పవర్ ట్రిప్పింగ్ అవుతుండటంతో రైతులు బావుల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోంది.కొండంరాజుపల్లికి చెందిన ఒక రైతు సాగునీరు అందక ఎదిగిన వరి పంటను చేసేదేమీ లేక పశువులకు మేతగా వదిలేశారు.

మొదటగా పుష్కలంగా నీరు ఉందని పంటలు సాగు చేస్తే తీర ఇప్పుడు మొక్కజొన్న లాంటి పంటల పరిస్థితి కూడా ఇలాగే ఉందని రైతులు వాపో తున్నారు. గత బిఆర్‌ఎస్ హయాంలో విద్యు త్,సాగునీటి సరఫరా సక్రమంగా ఉండేవని,ఇప్పుడు పరిస్థితి తలకిందులైందని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒక్కో మో టార్ వైండింగ్కు వేల రూపాయలు ఖర్చవుతుండటంతో రైతులు అప్పుల ఊబిలోకి జారుకుంటున్నారు.ప్రభుత్వం వెంటనే స్పం దించి లోవోల్టేజ్ సమస్యను పరిష్కరించే నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని నంగునూరు మండల రైతాంగం డిమాండ్ చేస్తుంది.

పూడిక తీయని కాలువలు...యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి

విద్యుత్ సమస్యకు తోడు సాగునీటి కాలువల నిర్వహణ లోపం రైతులకు శాపం గా మారింది.గతంలో ఎండకాలంలో కూడా చెరువులు నిండుకుండల్లా ఉండేవని, కానీ ఇప్పుడు కాలువల ద్వారా నీరు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంగునూరు మండలానికి వెళ్లే రంగనాయక సాగర్ ప్రధాన కుడి కాలువలో తుంగ, పూడిక పేరుకుపోవడంతో నీటి ప్రవాహం 310 క్యూసె క్కుల నుంచి 115 క్యూసెక్కుల వరకు గణనీయంగా తగ్గిపోయింది. దీని పై ఇటీవల మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట ఇరిగేషన్ ఎస్.ఈ. సుధా కిరణ్ తో మాట్లాడి, యుద్ధ ప్రాతిపదికన పూడిక తొలగింపు పనులు పూర్తి చేయాలని ఆదేశించా రు. కాలువ చివరి ఆయకట్టు రైతు వరకు సాగునీరు అందేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు.

కరెంట్ ఎప్పుడు వస్తుందో.. పోతుందో తెలియదు

విద్యుత్ హెచ్చుతగ్గుల వల్ల బావి మోటార్ కాలిపోయింది. దాన్ని బయటకు తీయడానికి ట్రాక్టరుకు కట్టి పొలం మధ్యలో నుంచి లాక్కొచ్చి మరమ్మతులు చేయించాల్సి వచ్చింది. మూడు ఎకరాల వరి పంట వేశాను,కళ్లముందే ఎండిపోతుంటే తట్టుకోలేకపోయాను. ప్రభుత్వం వెంటనే స్పందించి నాణ్యమైన విద్యుత్ అందించాలి.

 కర్రె సంపత్, రైతు, గట్లమల్యాల