12-02-2026 12:00:00 AM
బాలాజీ నగర్ విద్యుత్ ఏఈ సాంబశివరావు
జవహర్ నగర్ ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): 11 కెవి బాలాజీ నగర్ సబ్ స్టేషన్ పరిధి లోని ఏడు ఫీడర్ల పరిధిలో చెట్ల కొమ్మలను కత్తిరించడం, విద్యుత్ లైన్ల మెయిం టెనెన్స్ పనుల కారణంగా గురువారం ఈ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని బాలాజీ నగర్ విద్యుత్ ఏఈ సాంబ శివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభావిత ప్రాంతాలు చెన్నాపురం, లక్ష్మీనరసింహ కాలనీ, శివనగర్, ఆదర్శనగర్, వికలాంగుల కాలనీ, సింగల్ బెడ్ రూమ్, డబుల్ బెడ్ రూములు, ముత్తుస్వామి కాలనీ, బీరప్ప గడ్డ, భగత్ సింగ్ కాలనీ, గబ్బిలాలపేట ,శాంతినగర్, రాజీవ్ నగర్, మోహన్ రావు కాలనీ, వి కే ఎంక్లేవ్, ఎక్స్ సర్వీస్మెన్ కాలనీ, అయ్యప్ప కాలనీ ,సిటిజన్ కాలనీ, ఆనంద నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, వెంకటేశ్వర కాలనీ, బాలాజీ నగర్ మెయిన్ రోడ్డు, మార్వాడి గల్లి, మహంకాళి కాలనీ, సుక్కమ కుంట, సుభద్రయ్య కాలనీ, తదితర ప్రాంతాలలో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని వినియోగదారులు సహకరిం చాలని బాలాజీ నగర్ విద్యుత్ ఏఈ సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు.