calender_icon.png 12 February, 2026 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం

12-02-2026 12:00:00 AM

మొయినాబాద్‌లో 80.25 శాతం పోలింగ్ నమోదు

మొయినాబాద్, ఫిబ్రవరి 11(విజయ క్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీలో బుధవారం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. మున్సిపాలిటీ పరిధిలోని 26 వార్డులకు మొత్తం 52 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 32,871 మంది ఓటర్లలో 26,194 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

దీంతో మొత్తం 80.25. శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ తొలి రెండు గంటల్లో నెమ్మదిగా సాగింది. ఉదయం 9 గంటల వరకు 12.41 శాతం పోలింగ్ నమోదు కాగా, 11 గంటల వరకు 26.97 శాతానికి చేరుకుంది. అనంతరం పోలింగ్ వేగం పెరిగి మధ్యాహ్నం 1 గంటల వరకు 49.67 శాతం నమోదు అయింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 69.79 శాతం కాగా, పోలింగ్ ముగిసే సమయానికి 80.25 శాతానికి చేరుకుంది.

ఓటర్లకు గందరగోళం

పోలింగ్ కేంద్రాలకు వచ్చిన పలువురు ఓటర్లు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొన్నారు. బీఎల్‌ఓలు అనేక మందికి ఓటర్ స్లిప్పులు అందించకపోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు వేచి ఉండాల్సి వచ్చింది. ఒకేసారి ఎక్కువ మంది స్లిప్పుల కోసం గుమిగూడటంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.

కొన్ని కుటుంబాల్లో సభ్యుల ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఉండటంతో ఎవరు ఎక్కడ ఓటు వేయాలో తెలియక తికమకపడ్డారు. ఎనికేపల్లిలో ఓ మహిళ తన పేరు ఓటరు జాబితాలో మృతురాలిగా నమోదై ఉండటంతో ఓటు వేయలేకపోయింది. పెద్దమంగళారం 17వ వార్డులో మృతుడైన వ్యక్తి ఓటు మరొకరు వేసినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.

వృద్ధులు, వికలాంగులకు ఇబ్బందులు

పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. మొయినాబాద్లోని ఎంఆర్సిహెచ్ స్కూల్లో ఏర్పాటు చేసిన కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు లేకపోవడంతో వీల్చైర్లలో వచ్చిన వృద్ధులు మెట్లపై నుంచి సహాయంతో పైకి వెళ్లాల్సి వచ్చింది. ఎనికేపల్లిలో పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండటంతో వృద్ధులు, వికలాంగులు చేతికర్రలు, ఇతరుల సహాయంతో నడుచుకుంటూ వెళ్లారు. కొన్ని చోట్ల సరైన సౌకర్యాలు లేకపోవడం ఓటర్లకు అసౌకర్యంగా మారింది.మొత్తానికి మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినా, కొన్ని కేంద్రాల్లో ఏర్పాట్ల లోపాలపై ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.