16 May, 2026 | 8:01 PM

పేదలు ఉచిత న్యాయ సేవలు పొందాలి

16-05-2026 07:00 PM

జిల్లా న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, డాక్టర్. సి హెచ్ విఆర్ఆర్ ప్రసాద్

కామారెడ్డి,(విజయక్రాంతి): పేదలు న్యాయ సేవలను ఉచితంగా పొందవచ్చునని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్, సి హెచ్ వి ఆర్ ఆర్ వరప్రసాద్ అన్నారు. శనివారం కామారెడ్డి మహిళా సంఘం భవనంలో ఉచిత న్యాయ సేవలు, ప్రజలకు అందుబాటులో ఉన్న చట్టపరమైన సహాయం వంటి వాటిపై అవగాహన కల్పించారు. పోలీస్ కళాబృందం మానవ అక్రమ రవాణా, వాణిజ్య లైంగిక దోపిడీ, బాల్య వివాహాల నివారణ, ఫోక్ సో చట్టం, పిల్లల రక్షణ కు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి నాగరాణి, పోలీస్ ఇన్స్పెక్టర్ రామన్, ఏపీఎం శ్రీనివాస్, హ్యూమన్ ట్రాకింగ్ కానిస్టేబుల్ సౌజన్య,రాజేందర్, షీ టీం, పోలీస్ కళాబృందం ప్రతినిధులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.