14 August, 2026 | 11:00 PM

శ్రీధర్ బాబు, శ్రీను బాబు ఆశీస్సులతో తీగల సమ్మయ్యకు కీలక బాధ్యతలు

14-08-2026 10:12 PM

రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక

రామగిరి,(విజయక్రాంతి) రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తీగల సమ్మయ్య ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ నాయకుడు శ్రీను బాబు ఆశీస్సులతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సమ్మయ్యకు అవకాశం దక్కింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీగల సమ్మయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీ బలోపేతానికి, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని మండలంలో మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని  సమ్మయ్య తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.