16 May, 2026 | 7:49 PM

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ

16-05-2026 06:55 PM

ఆలేరు,(విజయక్రాంతి):  శనివారం ఆలేరు రైల్వే గేట్ దగ్గర మోడీ బీ జే పీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలను బేషరతు గా ఉపసంహరించుకోవాలని కేంద్ర బీ జే పీ మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ దేశంలో ప్రజలు పెట్రోల్,డీజిల్ ఇతర వస్తువులను పొదుపుగా వాడాలని చెప్పి ఈ విధంగా ధరలను పెంచడం ప్రజా వ్యతిరేక విధానాలలో భాగమని, దేశానికి అన్నం పెట్టే రైతన్నకు గిట్టుబాటు ధరలు చెల్లించలేని బీ జే పీ మోడీ ప్రభుత్వం, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మామిడాల భిక్షపతి, ఇక్కిరి సహదేవ్,  కల్లేపు అడివయ్య, పద్మ సుదర్శన్, చిర బోయిన రాజయ్య, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.