15 August, 2026 | 2:00 AM

బెల్టు బంద్... లేకుంటే రూ.50 వేల ఫైన్!

15-08-2026 12:57 AM

ఊరిలో మద్యం అమ్మితే రేషన్, పెన్షన్ కట్

జనగామ, ఆగస్టు 14 (విజయక్రాంతి) : జనగామ జిల్లా తరిగొప్పు మండల కేంద్రంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నిర్వహిస్తుండడంతో యువత చెడు వ్యసనాలకు బారిన పడుతున్నారు. దీంతో గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామసభ ఏర్పాటు చేసి పాలకవర్గం కఠిన నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ అర్జుల జ్యోతి మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో బెల్ట్ షాపులు పూర్తిగా మూసివేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు.

బెల్ట్ షాపు పెడితే రూపాయలు 50,000 జరిమానా వైన్ షాప్ నుండి బెల్ట్ కు మద్యం ఇస్తే 1,00,000 రూపాయలు జరిమానా అక్రమంగా అమ్మి పట్టుబడితే  రేషన్, పెన్షన్, అన్ని ప్రభుత్వ పథకాలు రద్దు ఊరిలో మద్యం అరికడితేనే యువత, కుటుంబాలు బాగుపడతాయి.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు అని సర్పంచ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిలివేరు మహేందర్, కార్యదర్శి రాంబాబు, వార్డ్ మెంబర్లు పింగిలి వేణుగోపాల్ రెడ్డి, చెన్నూరి మైపాల్, ధరావత్ రాజేష్, చింతల జైపాల్, కాత అజయ్, తాళ్లపల్లి రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.