రూ.15.70 కోట్ల ప్రభుత్వ బియ్యం దారి మళ్లింపు.. రైస్మిల్లర్‌పై పీడీ యాక్ట్ నమోదు
మంచిర్యాల క్రైమ్, ఆగస్టు 14: రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లుకు తరలించగా, ప్రభుత్వానికి అందించాల్సిన కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని అక్రమంగా దారి మళ్లించి, బ్లాక్మార్కెట్లో విక్రయించి ఆర్థిక లాభాలు పొందిన ఆరోపణలపై రైస్మిల్లర్ సంతోష్ కుమ్పా బ్లా క్మార్కెటింగ్ నిరోధక, నిత్యవసర వస్తువుల సరఫరా పరిరక్షణ చట్టం కింద పీడీ యాక్ట్ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా శుక్రవారం తెలిపారు.
సంతోష్ 2022 23 రబీ, 202425 రబీ సీజన్లలో మొత్తం 9,244.206 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ కోసం మిల్లులో దింపుకొని ప్రభుత్వానికి 6,286.059 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అందించాల్సి ఉం డగా, ఇప్పటివరకు 1,833.511 మెట్రిక్ ట న్నులు మాత్రమే అందించినట్లు అధికారులు గుర్తించారు. 4,452.548 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అందించాల్సి ఉండగా దానికి సమానమైన సుమారు 6,170.643 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దారి మళ్లించినట్లు కేసు దర్యాప్తులో తేలిందని తెలిపారు.
ఈ అక్రమాల వల్ల ప్రభుత్వానికి రూ.15.14 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొన్నారు. సంతోష్ పై ప్రభుత్వ ధాన్యం దారి మళ్లింపునకు సంబంధించి 2025, 2026 సంవత్సరాల్లో దండేపల్లి, హాజీపూర్ పోలీస్స్టేషన్లలో మరో రెండు కేసులు కూడా నమోదై ఉన్నాయని, కేసులు నమోదైనప్పటికీ అక్రమ కార్యకలాపాలు కొనసాగించారని, ప్రస్తుతం దండేపల్లి పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో నిందితుడు రిమాండ్లో ఉన్నాడని, బెయ్పి విడుదలైతే మళ్లీ ఇదే తరహా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు నివే దించిన నేపథ్యంలో పీడీ యాక్ట్ కింద నిర్బం ధ ఉత్తర్వులు జారీ చేసినట్లు సీపీ వెల్లడించారు. ఈ ఉత్తర్వులను లక్షెట్టిపేట సబ్జైలులో ఉన్న సంతోష్ కుమార్ కు జైలు అధికారుల సమక్షంలో లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్‌ఐ రాజవర్ధన్ లు అందజేసి, అనంతరం జైలుకు తరలించారన్నారు.






