15 August, 2026 | 12:54 AM

నత్తే నయం..!

15-08-2026 12:00 AM
  1. రహదారి నిర్మాణం పనులలో జాప్యం
  2. నెమ్మదిగా సాగుతున్న పనులు
  3. బురద దారిలో ప్రయాణికుల అవస్థలు
  4. పనులు వెంటనే పూర్తి చేసి రోడ్డును ప్రారంభించాలని స్థానికుల వేడుకోలు       

మఠంపల్లి, ఆగస్టు 14 : పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని దీని అర్థం. అలాంటి అభివృద్ధిలో ప్రధానమైంది రహదారుల నిర్మాణం. గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక గతంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిధులు మంజూరు చేసి రోడ్లను నిర్మించింది. అయితే అదే రహదారిని మరో రహదారి నిర్మాణం పేరుతో అభివృద్ధి పనులు అంటూ తవ్వేసి నెలల తరబడి పనులు చేపట్టక వదిలేయడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇకట్లు పడుతున్నారు. 

మండలంలో ఇదీ పరిస్థితి  

మండల పరిధిలోని అల్లీపురంభీల్యా నా యక్ తండా,లాలి తండా -పెదవీడు, కొత్త దొ నబండ తండా -అవిరేనికుంటాతండా,పెదవీడు -అవిరేనికుంటతండా గ్రామాలకు వెళ్లా లంటే గతంలో సరైన రహదారి లేక ఈ మా ర్గంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ముఖ్యంగా వర్షాకాలంలో రహదా రి బురదమయంగా మారడంతో ఆ దారి గుండా వెళ్ళే గ్రామస్తులు, రైతులు,విద్యార్థు లు,మహిళలు నరకయాతన అనుభవించేవారని స్థానికులు చెబుతున్నారు .గ్రామీణ ప్ర జలకు సరైన రహదారి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం సీఆర్‌ఆర్ 202425 నిధుల కింద రహదారి నిర్మాణం చేపట్టారు.

 కొత్తగా నిర్మించిన రోడ్డునే మళ్లీ తవ్వేశారు..

అంతవరకు బాగానే ఉన్న కొంతకాలం త ర్వాత ఇదే మార్గంలో నూతన ఆర్‌అండ్బీ ర హదారి నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఇప్పటికే ఉ న్న రహదారిని కొంత మేర తవ్వారు. కొత్త రహదారి నిర్మాణంతో తమ కష్టాలు శాశ్వతంగా తీరుతాయని గ్రామస్తులు భావించా రు. అయితే రహదారిని తవ్విన అనంతరం పనులు నత్తనడకన కొనసాగుతుండటంతో ఆ దారిలో ప్రయాణం చేయలేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.   

నెలలు గడిచినా ప్రారంభం కాని పనులు

కొత్తగా నిర్మించిన రహదారి తవ్వి రెండు నుంచి నాలుగు నెలలు గడుస్తున్నా పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని ఆయా గ్రామా ల ప్రజలు తెలిపారు. దీంతో గతంలో రహదారి సౌకర్యం లేక ప్రజలు పడిన ఇబ్బం దులే ప్రస్తుతం మళ్లీ ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బురదలోనే ప్రయాణికుల రాకపోకలు..

ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో తవ్విన రహదారి మొత్తం బురదమయంగా మారింది. సుమారు రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర బురదలోనే ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొందని స్థానికులు చెబు తున్నారు. ద్విచక్ర వాహనదారులు, విద్యార్థులు, మహిళలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు తవ్విన ప్రాంతాల్లో నిలిచి రహదారి మరింత అధ్వానంగా మారిందని,రహదారి అంచుల వద్ద ఇరువైపుల మట్టి కట్టలు వేయడంతో నీరు ప్రవహించే సరైన మార్గం లేక బురద పేరుకుపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతులకు తప్పని తిప్పలు

ఈ రహదార్లు వ్యవసాయ పొలాలకు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి నిర్మాణం ఎత్తుగా ఉండటంతో పొలాల్లోకి ట్రాక్టర్లు,ఇతర వ్యవసాయ వాహనాలను తీసుకెళ్లడం కష్టంగా మారిందని రైతులు చెబుతున్నారు.కొన్ని చోట్ల రహదారి ఎత్తు,పక్కనున్న ప్రాంతం లోతుగా ఉండటంతో ట్రాక్టర్లు అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో రహదారి పరిస్థితి ఇలా ఉండటం తో రైతులకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఆర్‌అండ్‌బీ శాఖ పర్యవేక్షణపై తలెత్తుతున్న ప్రశ్నలు

ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు నిధులు కేటాయిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం రహదారులను తవ్వి నెలల తరబడి పనులు చేపట్టకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కాంట్రాక్టర్ పనులు ఆల స్యం చేస్తుంటే సంబంధిత అధికారులు ఎం దుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. పనుల పురోగతిని పర్యవేక్షించాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తున్నారా లేదా అనే అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి.

రహదారి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

నూతన రహదారి నిర్మాణ పనులు ముందుకు సాగటం లేదు.వర్షం పడితే బురద,ఎండ వస్తే దుమ్ముతో అవస్థలు పడాల్సి వస్తుంది. అధికారులు ఇప్పటికైనా నిర్మాణం రహదారి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

బానోతు బాబు నాయక్, కొత్త దొనబండ తండా

త్వరలో ఈ రోడ్లు పూర్తి చేస్తాం

ఈ రోడ్లు నిర్మాణం విషయంలో కొంత ఆలస్య అయింది, కొంత వరకు పనులు జరిగాయి, మెటల్ దొరకక ఆల స్యం అవుతుంది. త్వరలోనే రోడ్లు నిర్మా ణ పనులు పూర్తి చేసి ఇబ్బందులు లేకుండా చేస్తాం.

కిరణ్ కుమార్, ఆర్‌అండ్‌బి ఏఈఈ, మఠంపల్లి