ఘనంగా తిరంగా యాత్ర ర్యాలీ
14-08-2026 10:07 PM
హత్నూర: సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని దౌల్తాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు 100 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శిస్తూ దౌల్తాబాద్ పురవీధుల్లో భారీగా పాల్గొన్నారు. వందేమాతరం, భారత్ మాతాకీ జై నినాదాలతో ర్యాలీ హోరెత్తింది. అనంతరం మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ దేశంపై ప్రతి ఒక్కరూ గౌరవ భావంతో ఉండాలని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.






