11-02-2026 11:56:43 AM
మున్సిపల్ లో 53,403 ఓటర్లు
28 వార్డులు, 92మంది అభ్యర్థులు
పురుషులు - 26,679, మహిళలు -26723 ఓటర్లు, ఇతరులు 01
మొత్తం వార్డులు- 28, పోలింగ్ సిబ్బంది 380మంది
పోలింగ్ స్టేషన్లు - 76
షాద్‌నగర్ ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ మున్సిపాలిటీలో బుధవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఆఫీసర్ కమిషనర్ సునీతారెడ్డి పరివేక్షణలో పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. షాద్ నగర్ మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు -53,403 ఉండగా ఇందులో పురుషులు - 26,679, మహిళలు -26723, ఇతరులు- 01, మొత్తం వార్డులు- 28, పోలింగ్ సిబ్బంది 380 మంది, పోలింగ్ స్టేషన్లు - 76 ఉండగా షాద్ నగర్ డిసిపి సిహెచ్ శిరీష నేతృత్వంలో ఏసిపి లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో పోలీస్ బందోబస్త్ 200మందితో ఎన్నికలు ప్రశాంతంగా మొదలయ్యాయి.