calender_icon.png 11 February, 2026 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ దంపతులు

11-02-2026 11:59:25 AM

మెదక్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని  మున్సిపాలిటీ గాంధీనగర్  వార్డ్ నెంబర్ -18 పోలింగ్ స్టేషన్ నెంబర్ 35 వద్ద కలెక్టర్ దంపతులు సామాన్య ఓటరుల్లా వరుసలో నిలబడి ఓటు వేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి చేరుకుని నిర్భయంగా ఓటు వేయాలని, స్థానిక  స్వపరిపాలనలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.