28 May, 2026 | 2:42 AM

యువకుడి హత్య కేసు చేధించిన పోలీసులు

28-05-2026 01:52 AM
  1. ఏ1 నిందితుడి అరెస్ట్
  2. కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి

కోదాడ మే 27,ఇటీవల హత్యకు గురైన గణపవరం గ్రామానికి చెందిన యువకుడు బల్గూరి గణేష్ హత్యకేసును సాంకేతిక ఆధారాలతో చేధించినట్లు కోదాడ డీఎస్పీ శ్రీని వాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన కోదాడలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ హత్య కేసులో ఏ1 నిందుతుడు బర్రెంకుల సోమేష్ను హుజూర్నగర్లో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. సోమే ష్ అరెస్ట్తో కేసుతో సంబంధం ఉన్నవారంతా అరెస్ట్ అయ్యారన్నారు.

పోలో యాప్ ద్వారా ఏర్పడిన పరిచయం, ఏకాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలతో ఏర్పడిన విబే ధాలు తారాస్థాయికి చేరి హత్యకు దారితీశాయని వివరించారు. ఈ సమావేశంలో ఇం చార్జ్ రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి, రూరల్ ఎస్త్స్ర గోపాల్ రెడ్డి మేళ్లచెరువు ఎస్‌ఐ నవీన్ కుమార్ చింతలపాలెం ఎస్త్స్ర పరమేష్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.