28 May, 2026 | 2:41 AM

మహిళల చేతికి సోలార్ పవర్

28-05-2026 01:52 AM
  1. డిప్యూటీ సీంఎ భట్టి విక్రమార్క
  2. దేశంలోనే తొలిసారి మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్రాజెక్టులు
  3. ఖమ్మం జిల్లా వెంకటాపురంలో ప్లాంటు ప్రారంభం

ఎర్రుపాలెం, మే 27 (విజయక్రాంతి): మహిళల ఆర్థిక స్వవలంబనే ధ్యేయమని డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం లో వెంకటాపురం గ్రామంలో ఇందిరా మ హిళా శక్తి పథకంలో భాగంగా 3 కోట్ల రూపాయలతో నిర్మించిన సోలార్ పవర్ ప్రాజెక్టును మహిళా సంఘాలకు అప్పగించారు. ప్లాంట్‌ను మంత్రి సీతక్కతో కలిసి ఆ యన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక సాధికారత కోసం సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రా రంభించడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి అన్నారు.

మహిళా సంఘాల సభ్యులతో సో లార్ పవర్ ప్రాజెక్టులు నిర్మించి, వారి ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. మహిళలను మహాలక్ష్మిలుగా భావించే ప్రజా ప్రభుత్వం వారికి అ నేక సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. మహిళా స్వయం సంఘాల కోసం వడ్డీ లేని రుణాలను పెద్ద ఎత్తున  అందజేస్తోందన్నారు.

ఈ సోలార్ ప్లాంట్ ద్వారా మహిళా సంఘాలకు రోజుకు రూ.14వేల నుంచి రూ.15వేల వర కు అంటే నెలకు సుమారు రూ.4.5 నుండి 5 లక్షల వరకు ఆదాయం లభిస్తుందని తెలిపారు. ?ఉత్పత్తి అయిన విద్యుత్తును డిస్కమ్ లు కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ దానకిషోర్, సీఈవో దివ్య దేవరాజన్, ఖమ్మం కలెక్టర్ దివాకర్, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, అనిల, ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, గిడ్డంగుల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర పాల్గొన్నారు.