రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన పోలీసులు
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నాగిరెడ్డిపేట మండల పరిధిలోని గోలీలింగాల, గోపాల్పేట్ గ్రామాలలో అరెవే అలైవ్ రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ మాట్లాడుతూ... ప్రజలకు రోడ్డు భద్రత నియమాలు హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యత,సీట్ బెల్ట్ వినియోగం, అధిక వేగం వల్ల కలిగే ప్రమాదాలు, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించి సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. అలాగే మెల్లకుంట తండా గ్రామానికి చెందిన నిఖిల్ అనే విద్యార్థి జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు సాధించిన సందర్భంగా అతనిని అలాగే ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అతని తండ్రి వసేందర్ను నాగిరెడ్డిపేట్ మండల పోలీస్ సిబ్బంది ఘనంగా సన్మానించి అభినందించారు.అలాగే నిఖిల్ను స్ఫూర్తిగా తీసుకొని అన్ని గ్రామాల విద్యార్థులు కృషి చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.




